కరోనా అక్కడికీ దూరిపోయింది!

తాజా వార్తలు

Published : 23/12/2020 09:45 IST

కరోనా అక్కడికీ దూరిపోయింది!

శాంటియాగో: ఇప్పటి వరకు కరోనా వైరస్‌ దూరని ప్రదేశమేదైనా ఉందా అంటే అంటార్కిటికా అని ఠక్కున చెప్పాం. ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. అక్కడికీ ఈ మహమ్మారి పాకిపోయింది. దీంతో ప్రపంచంలోని ప్రతి ఖండానికీ వైరస్‌ వ్యాపించినట్లైంది.

అంటార్కిటికాలోని చిలీకి చెందిన రెండు సైనిక స్థావరాల్లోని సైనికులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం 36 మందికి గుర్తించగా వీరిలో 10 మంది అక్కడి అధికారుల ఇళ్లలో విధులు నిర్వర్తిస్తున్న సామాన్య పౌరులు. మంగళవారం 21 మందికి పాజిటివ్‌గా తేలగా.. వీరంతా సెర్జియాంట్‌ ఆల్డీ అనే నౌకలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నౌకతో అక్కడికి కావాల్సిన సరకుల్ని రవాణా చేస్తుంటారు. ఓ లెఫ్టినెంట్‌ స్థాయి అధికారి ఇంట్లో పనిచేసే సామాన్య పౌరుడికీ పాజిటివ్‌గా తేలింది. దీంతో అంటార్కిటికాలో తమ దేశానికి చెందిన మొత్తం 58 మందికి వైరస్‌ సోకినట్లు చిలీ సైన్యం ప్రకటించింది.

ఇక అంటార్కిటికాలో తమ దేశ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్న సిబ్బందికి సురక్షితంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది. కరోనా బారిన పడ్డ చిలీ సైనికులతో అమెరికా సిబ్బంది కాంటాక్ట్‌లోకి రాలేదని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

దేశంలో కొత్త అలజడి

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్దరిలో కొవిడ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని