యుద్ధ ట్యాంకర్‌పై మోదీ

తాజా వార్తలు

Published : 14/11/2020 15:44 IST

యుద్ధ ట్యాంకర్‌పై మోదీ

జైసల్మేర్‌: సరిహద్దుల్లో  విధులు నిర్వహిస్తున్న వీర జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వెళ్లిన ప్రధాని.. అక్కడి లోంగేవాలా పోస్ట్‌లోని జవాన్లను కలిశారు. సైనికులు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యుద్ధ ట్యాంకర్‌పై ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. మోదీ యుద్ధ ట్యాంకర్‌పై ప్రయాణించిన ఫొటోలు సోషల్‌ మీడియాతో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సైనికులనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు చేశారు. సరిహద్దుల్లో భారత సహనాన్ని పరీక్షిస్తే సరైన జవాబు తప్పదని హెచ్చరించారు. దేశ భద్రత, ప్రయోజనాలపై భారత్‌ ఎన్నటికీ రాజీ పడబోదని స్పష్టం చేశారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ ఏటా దీపావళి పండగను జవాన్లతో చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇదీ చదవండి.. సరిహద్దుల్లో పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదు

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని