ఎమిరేట్స్‌ ప్రవాస భారతీయులకు శుభవార్త

తాజా వార్తలు

Published : 02/08/2020 00:55 IST

ఎమిరేట్స్‌ ప్రవాస భారతీయులకు శుభవార్త

దుబాయి: యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్ (యుఏఈ)లో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. ఇక్కడి ప్రవాస భారతీయులు కేవలం రెండు రోజుల్లోనే తమ పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించుకునేందుకు (రెన్యూవల్‌) వీలుగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సౌలభ్యం నేటి నుంచి అమలులోకి రానుందని తెలిసింది. నూతన విధానం ప్రకారం.. ప్రవాసుల నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు స్వీకరించిన రోజే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని దుబాయిలోని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ అమన్‌పురి వెల్లడించారు. అయితే పోలీసుల నిర్ధారణ, భారత్‌ నుంచి అనుమతులు లభించాల్సి రావటం తదితర ప్రత్యేక అనుమతులు అవసరమైన సందర్భాల్లో ఈ ప్రక్రియ సుమారు రెండువారాల పాటు కొనసాగవచ్చని ఆయన వివరించారు.

అంతేకాకుండా ఏ ఎమిరేట్స్‌ సభ్యదేశంలో నివసించే భారతీయుడైనా ఇకపై దుబాయిలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. కాగా, ఇప్పటి వరకు సభ్య దేశాలకు వేర్వేరు పాస్‌పోర్ట్‌ ధృవీకరణ కేంద్రాలను నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అధికంగా ఇక్కడి కార్యాలయం రెండు లక్షలకు పైగా పాస్‌పోర్టులను జారీ చేసిందని ఇక్కడి అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని