యూఎస్‌ 2020: చరిత్రలోనే భద్రమైన ఎన్నికలు

తాజా వార్తలు

Published : 14/11/2020 01:34 IST

యూఎస్‌ 2020: చరిత్రలోనే భద్రమైన ఎన్నికలు

వాషింగ్టన్‌: నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైనవి అని అగ్రరాజ్యంలో ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ టెక్నాలజీ కంపెనీలు, ఫెడరల్‌ ఉన్నతాధికారులు బలంగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తన ఓట్లను దొంగలించారని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే వాదిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓట్లు డిలీట్‌ అయ్యాయని, మారిపోయాయని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టంగా చెప్పారు. అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలు ఇవేనని వెల్లడించారు. 

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఇంతవరకూ అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్‌.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తనకు రావాల్సిన ఓట్లను బైడెన్‌ దొంగలించారని ట్రంప్‌ ఆరోపించారు. అంతేగాక, కొన్ని చోట్ల ఓట్లు డిలీట్‌ అయ్యాయని అన్నారు. ట్రంప్‌ ఆరోపణలను నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ ఎలక్షన్‌ డైరెక్టర్స్, నేషనల్‌ అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్‌ ఆఫ్‌ స్టేట్‌ ప్రెసిడెంట్స్‌ తోసిపుచ్చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. 

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత జో బైడెన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తన ఓటమిని ఇంకా అంగీకరించని ట్రంప్‌.. ఎన్నికల ఫలితాలపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటు అధికార మార్పిడికి కూడా ఆయన ససేమిరా అంటున్నారు. అధ్యక్షుడి తీరుపై బైడెన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం.. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని