close

తాజా వార్తలు

నాపై అభిశంసన సరైంది కాదు: ట్రంప్‌

వాషింగ్టన్‌: దేశం కోసం ఎంతో చేస్తున్న తనపై అభిశంసన తీసుకురావడం సరైంది కాదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని ట్వీట్ చేసిన ఆయన.. రాజకీయ ప్రేరేపితంగానే తనపై ఈ అభిశంసన తీసుకొచ్చారంటూ డెమోక్రాట్‌ పార్టీపై మండిపడ్డారు. 

‘నేను ఏ తప్పు చేయనప్పుడు నాపై అభిశంసన తీసుకురావడం సరైన నిర్ణయం కాదు. నన్ను ఎదుర్కోలేని డెమోక్రాట్లు ద్వేషపూరితంగా మారారు. ఈ విధానం దేశానికి మంచిది కాదు’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు అభిశంసనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇదంతా ఓ బూటకమని అన్నారు. రాజకీయ ప్రేరేపితంగానే తనపై అభిశంసన తీసుకొచ్చారన్నారు. అభిశంసన తీర్మానాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని, అయితే ఏ తప్పు చేయని తనపై ఈ తీర్మానం తీసుకురావడం భయంకరమైన చర్య అని అన్నారు. చాలా ఏళ్ల నుంచి తన వెనుక ఇలాంటి కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. 

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ట్రంప్‌పై ఆరోపణలు రావడంతో ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. ఈ తీర్మానంపై వచ్చే వారం ప్రతినిధుల సభలో ఓటింగ్‌ జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ ట్వీట్లు చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.