ప్రపంచ ఆహార కార్యక్రమానికి శాంతి నోబెల్‌

తాజా వార్తలు

Updated : 09/10/2020 15:19 IST

ప్రపంచ ఆహార కార్యక్రమానికి శాంతి నోబెల్‌

ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు, సంక్షోభిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగానూ డబ్ల్యూఎఫ్‌పీని నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. సంక్షోభిత ప్రాంతాల్లో ఆకలిని ఆయుధంగా చేసుకోవడాన్ని ఈ కార్యక్రమం అరికడుతోందని నోబెల్‌ కమిటీ కితాబిచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ. ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది.

యుద్ధం, సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలకు గురవుతున్నారు. ఒక్క 2019లోనే 135 మిలియన్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను తీర్చడానికి, ఆకలి బాధలను నిర్మూలించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషచేస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది 88 దేశాల్లో దాదాపు 100 మిలియన్ల మంది అన్నార్థుల ఆకలి తీర్చింది డబ్ల్యూఎఫ్‌పీ. 

ప్రస్తుతం ప్రపంచమంతా విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారి.. ఈ ఆకలి బాధలను మరింత పెంచింది. యెమెన్‌, కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్‌, బుర్కినాఫాసో లాంటి దేశాల్లో అటు హింసాత్మక ఘర్షణలు, ఇటు కరోనా వల్ల ఆకలి తీవ్ర రూపం దాల్చింది. ఈ దేశాల్లో తిండిలేక ఎంతో మంది విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి వారి కోసం డబ్ల్యూఎఫ్‌పీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక, యుద్ధంతో సతమతమవుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తోంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని