close

తాజా వార్తలు

Published : 01/12/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ దర్యాప్తును రాజకీయం చేయొద్దు : WHO

వైరస్‌ మూలాన్ని తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుగొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ సమాచారం ఎంతో అవసరమని ఉద్ఘాటించింది.

కొవిడ్‌-19 మూలల కోసం జరుగుతున్న పరిశోధనను రాజకీయం చేయొద్దని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కోరారు. ఇలాంటి చర్యలు నిజాన్ని వెలికితీయడంలో ఉపయోగపడవని పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని డబ్ల్యూహెచ్‌వో వుహాన్‌ నుంచి ప్రారంభిస్తుందని.. లభించిన ఆధారాలనుబట్టి ఇతర మార్గాలు ఉంటే అన్వేషిస్తుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు.

డబ్ల్యూహెచ్‌వో స్థానం గురించి మాట్లాడుతూ ‘డబ్ల్యూహెచ్‌వో స్థానం చాలా స్పష్టంగా ఉంది.ఈ వైరస్‌ మూలాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఇది మాకు సహాయపడుతుంది’ అని అధనామ్‌ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ నెల నుంచి నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో గతవారం తొలిసారిగా తగ్గుదల కనిపించిందని.. ఐరోపాలో వైరస్‌ బాధితుల సంఖ్య తగ్గడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 6.3 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 14.73 లక్షలకు చేరింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని