పుల్వామా ఉగ్రదాడి కేసులో మరొకరి అరెస్టు
close

తాజా వార్తలు

Published : 07/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుల్వామా ఉగ్రదాడి కేసులో మరొకరి అరెస్టు

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుల్వామా ఉగ్రదాడి కేసులో మరొక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయాగా తాజాగా ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడంతోపాటు, వీరికి రవాణా సదుపాయాన్ని కల్పించాడనే అనుమానంతో జమ్ముకశ్మీర్‌కు చెందిన బిలాల్ అహ్మద్‌ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. బిలాల్‌ అహ్మద్‌కు పాకిస్థాన్‌ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌తోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ ఉన్న మొబైల్స్‌తో ఉగ్రవాదులతో మాట్లాడేవాడని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. వారికి ఆశ్రయమివ్వడంతోపాటు పుల్వామా దాడి వ్యూహరచనలో బిలాల్‌ హస్తం ఉందని అనుమానిస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లిన ట్రక్‌ డ్రైవర్‌ అదిల్ అహ్మద్‌దార్‌ తీసిన వీడియో క్లిప్‌ బిలాల్ మొబైల్‌లో ఉండటం ఎన్‌ఐఏ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పుల్వామా ఘటనతో సంబంధముందనే అనుమానంతో గత గురువారం బుద్గాంకు చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ రేథర్‌(25) అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని