రంగంలోకి దిగిన మెలానియా ట్రంప్‌..

తాజా వార్తలు

Published : 28/10/2020 11:57 IST

రంగంలోకి దిగిన మెలానియా ట్రంప్‌..

తన భర్త డొనాల్డ్‌ ట్రంప్ యోధుడంటూ కితాబు

అట్‌గ్లెన్‌: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తొలిసారి ప్రచార రంగంలోకి దిగారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం జరిగిన ఓ ప్రచార సభలో తన భర్త, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ఆమె స్వయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఓ నిజమైన ఫైటర్‌ (యోధుడు) అని మెలానియా ప్రశంసించారు.

రెండో విడత అధ్యక్షుడయ్యేందుకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. అధ్యక్షుడి సంతానం ఎరిక్‌ ట్రంప్‌, ఇవాంకా ట్రంప్‌ తదితరులు ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రథమ మహిళ నిజానికి ఇదివరకే తన భర్తతో కలసి ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు కరోనా వైరస్‌ సోకటంతో ఆ ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి.

ఆయన పోరాడతారు...

ఎన్నికల విజయంలో కీలక పాత్ర వహించే పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అట్‌గ్లెన్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో మెలానియా ట్రంప్‌ తొలిసారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రంప్‌ ఓ యోధుడని.. దేశాన్ని అమితంగా ప్రేమించే ఆయన దానికోసం ప్రతి ఒక్క రోజూ పోరాడతారని ప్రకటించారు. కరోనా సోకినప్పుడు తమ కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కొవిడ్‌తో మరణించిన 2,25,000 మంది కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహమ్మారిపై తప్పక విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా అనుక్షణం అందుబాటులో ఉండటం దేశ చరిత్రలోనే తొలిసారి అని ఆమె ట్రంప్‌కు కితాబిచ్చారు. కానీ ట్రంప్‌ చెప్పే అన్ని అంశాలతో తాను ఏకీభవించనని ఆమె అనటం సభికులలో నవ్వులు పూయించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని