భారత జవాన్లకు మైక్‌ పాంపియో నివాళి

తాజా వార్తలు

Updated : 27/10/2020 11:40 IST

భారత జవాన్లకు మైక్‌ పాంపియో నివాళి

దిల్లీ: అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద భారత అమర జవాన్లకు నివాళులర్పించారు. భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చల్లో పాల్గొనేందుకు వారు సోమవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా వీరు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌లతో ఈ ఉదయం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో రక్షణ సంబంధాలు పటిష్ఠం చేసే అతి కీలక ‘బేసిక్‌ ఎక్స్ఛేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌’ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అనంతరం వారు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీకానున్నారు.

భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి పర్యటన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత పర్యటన అనంతరం పాంపియో, ఎస్పర్‌లు శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియాలను కూడా సందర్శించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని