వివాదంలో మెలానియా ట్రంప్‌!

తాజా వార్తలు

Published : 27/08/2020 00:37 IST

వివాదంలో మెలానియా ట్రంప్‌!

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రెండోసారి అత్యున్నత పీఠాన్ని చేజిక్కించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పోటీపడుతున్న సమయంలో ఆయన కుటుంబం వివాదంలో చిక్కుకుంది. ఆయన సతీమణి, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అధ్యక్షుడు, ఆయన పెద్ద కుమార్తె ఇవాంక ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ‘మెలానియా&మి: ది రైజ్‌ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్‌షిప్‌ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో తన సవతి పిల్లలు ముఖ్యంగా ఇవాంకపైన ఆమె తీవ్ర ఆసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పుస్తక రచయిత్రి ఒకప్పటి మెలానియా స్నేహితురాలు స్టెఫానీ విన్‌స్టన్‌ వాకాఫ్. ఆమెకు తెలీకుండా ఆ వ్యాఖ్యలను స్టెఫానీ రికార్డు చేసినట్లు ఆ దేశ మీడియా రిపోర్టర్‌ యాషర్ ఆలీ వెల్లడించారు. దానికి సంబంధించి ఆయన వరస ట్వీట్లు చేశారు.

ట్రంప్‌ గురించి కూడా వ్యాఖ్యలు చేసినప్పటికీ, వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు. ఈ విషయాలను పుస్తకంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు ధ్రువీకరించారని వెల్లడించారు. అయితే ఈ విషయాలపై సమాచారం ఉంది కానీ, ఏ వ్యాఖ్యలు చేశారో స్పష్టత లేదని తెలిపారు. కాగా, మెలానియా తన భర్త ట్రంప్‌ అధ్యక్షుడిగా సాధించిన విజయాలను రిపబ్లికన్‌ నేషనల్ కన్వెన్షన్‌లో మంగళవారం రాత్రి ప్రస్తావించడానికి ముందు.. ఈ వివాదాస్పద వార్త బయటకు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ పుస్తకం సెప్టెంబరు ఒకటిన విడుదల కానున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని