ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం!

తాజా వార్తలు

Published : 07/09/2020 01:17 IST

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం!

పెద్ద ఘటనగా ప్రకటించిన బర్మింగ్‌హామ్‌ పోలీసులు

ఇంగ్లాండ్‌: బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్లో వరుస కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. నగరంలోని సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు అక్కడేవున్న స్థానికులపై వరుస కత్తిపోట్లకు పాల్పడినట్లు వెస్ట్‌మిడ్‌లాండ్‌ పోలీసులు వెల్లడించారు. దుండగులు వరుసగా చాలామందిపై కత్తులతో దాడులకు పాల్పడి గాయపరిచినట్లు గుర్తించారు. అయితే, ఈ దాడులకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఎంతమందికి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. కానీ, దీన్ని అతి పెద్ద ఘటనగానే బర్మాంగ్‌హామ్‌ పోలీసులు ప్రకటించారు. దాడులకు గల కారణాలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. తాజా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, సమీపంలోని రోడ్లన్నీ మూసివేసి దుండగుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో ఒక్కోసారి స్వల్ప ఘర్షనలు జరిగినప్పటికీ, ఈ తరహా సంఘటన మాత్రం ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని