‘డిసెంబర్‌ చివరి దాకా స్కూళ్లు తెరవం’

తాజా వార్తలు

Published : 23/11/2020 17:19 IST

‘డిసెంబర్‌ చివరి దాకా స్కూళ్లు తెరవం’

కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటన

బెంగళూరు: కరోనా నేపథ్యంలో మార్చి నుంచి మూతపడిన పాఠశాలలను డిసెంబర్‌ నెలాఖరు వరకు తెరవబోమని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. తదుపరి నిర్ణయం తీసుకొనే వరకు బడులతో పాటు కళాశాలలూ మూసే ఉంటాయని స్పష్టంచేశారు.  విద్యా రంగ నిపుణుల అభిప్రాయం మేరకు  డిసెంబర్‌ వరకు పాఠశాలలు, కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావన్నారు. ఇప్పటికే కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమైనా హాజరు 5శాతంగా మాత్రమే ఉందన్నారు. అందువల్ల డిసెంబర్‌ నెలాఖరులో సమావేశమవుతామని, రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించాక తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. 

విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్య కమిటీ అధికారులు, విద్యారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమావేశం అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.  సెప్టెంబర్‌ నెలలో రోజుకు 10వేలు చొప్పున వచ్చిన కొత్త కేసులు.. దీపావళి నాటికి తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు కర్ణాటకలో 8.7లక్షల పాజిటివ్‌ కేసులు, 11,654 మరణాలు నమోదైన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని