కేబినెట్‌ విస్తరణపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం

తాజా వార్తలు

Updated : 19/11/2020 01:29 IST

కేబినెట్‌ విస్తరణపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం

న్యూదిల్లీ: కర్ణాటక కేబినెట్‌ విస్తరణపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం బుధవారం ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర్ర కేబినెట్‌లో కొత్త వారిని తీసుకునే అంశంపై చర్చించడానికి యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి గోవింద్‌ కార్జోల్‌.. నడ్డాను దిల్లీలో కలిశారు.  రాష్ట్ర్రాభివృద్ధి గురించి కూడా కొన్ని విషయాలు చర్చించినట్లు సీఎం తెలిపారు.  దేశ పర్యటనలో భాగంగా నడ్డా డిసెంబర్‌లో కర్ణాటకను సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్‌‌ విస్తరణపై పూర్తి బాధ్యతలు నడ్డా చేతిలో ఉన్నాయన్నారు.  ఈ సమావేశంలో పార్టీలో నుంచి కొంత మంది మంత్రులపై వేటు వేయడం, మార్చడంపై చర్చించామన్నారు.  ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు ఉమేశ్‌ కత్తి కేబినెట్‌ మంత్రి పదవీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం కర్ణాటక కేబినెట్‌లో 27 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు ఏడు కేబినెట్‌ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని