హారిస్ ప్రసంగంలో భారతీయ పదం

తాజా వార్తలు

Updated : 21/08/2020 06:20 IST

హారిస్ ప్రసంగంలో భారతీయ పదం

వాషింగ్టన్‌: నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్.. బుధవారం ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ కీలక ప్రసంగం చేశారు. ఉపాధ్యక్ష పదవికి పోటీచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. అలానే తన తల్లి నేర్పిన విలువలకు, జో బైడెన్‌ ఆలోచనలకు కట్టుబడి పనిచేస్తాని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ‘చిత్తి’ అనే తమిళ పదం ఉపయోగించారు. దాంతో దాని అర్థం  ఏమై ఉంటుందా అని తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో విపరీతంగా వెతికారట. చాలాసేపు ఆ పదం గూగుల్ ట్రెండ్స్‌లోకి రావడంతో నెట్టింట్లో దాని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ తమిళంలో ‘చిత్తి’ అంటే పిన్ని అని అర్థం.

భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ తన ప్రసంగంలో కుటుంబ ప్రాధాన్యం గురించి చెప్పుకొస్తూ ఈ పదం ఉపయోగించారు. చిన్నతనంలో తన తల్లితో దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ ‘‘నాకు, నా సోదరికి నా తల్లి ఎన్నో విలువలు నేర్పింది. కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నేర్పింది’’ అని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కుటుంబం, భారతీయ సంప్రదాయం, భాష గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి అని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మన విషాదాలను అస్త్రాలుగా మార్చుకుంటున్నారని, ఆయన నాయకత్వ వైఫల్యం మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేసిందని విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని