అందుకు ఇవాంక అర్హురాలు: ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 29/08/2020 18:21 IST

అందుకు ఇవాంక అర్హురాలు: ట్రంప్‌

వాషింగ్టన్‌: డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హారిస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అధ్యక్షురాలు అయ్యే అర్హత కమల కంటే తన కుమార్తె ఇవాంక ట్రంప్‌కే ఎక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శుక్రవారం న్యూహాంప్‌షైర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 

‘మీకు తెలుసా..నేను దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిని చూడాలనుకుంటున్నాను. కానీ ఆమెను కాదు. ఆమె సమర్థురాలు కాదు’ అంటూ కమల మీద ట్రంప్‌ విమర్శలు చేశారు. కాగా, ఆ ర్యాలీలో కొందరు ఇవాంక ట్రంప్‌ అంటూ కేకలు వేశారు. ‘వారంతా ఇవాంక రావాలి అంటున్నారు. దాన్ని నేను తప్పుపట్టడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున తిరిగిపోటీ చేసేందుకు గురువారం ఆయన నామినేషన్‌ను స్వీకరించారు. అనంతరం ఆయన పాల్గొన్న మొదటి ర్యాలీ ఇది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని