ముందస్తు ఓటు వేసిన బైడెన్‌

తాజా వార్తలు

Published : 29/10/2020 21:53 IST

ముందస్తు ఓటు వేసిన బైడెన్‌

కరోనాకు మంత్ర దండమేదీ లేదన్న బైడెన్‌

వాషింగ్టన్: డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తన స్వంత రాష్ట్రమైన డెలావేర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. విల్మింగ్‌టన్‌లోని ‘డెలావేర్‌ స్టేట్‌ బిల్డింగ్‌’లో తన సతీమణి జిల్‌ బైడెన్‌తో కలసి ముందస్తు ఓటు వేశారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పలువురు అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే  మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య బుధవారం నాటికి 74 మిలియన్లకు చేరుకుంది. అమెరికా పౌరులకు ఉత్తమ ఆరోగ్య వసతి కలిగించే ‘ఎఫొర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌’ (ఏసీఏ) అమలుకు ప్రత్యర్థి వర్గమైన రిపబ్లికన్లతో కలసి పనిచేస్తానని ఈ సందర్బంగా బైడెన్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ చెప్పిన విధంగా కరోనాను మాయం చేసే మంత్రదండం ఏదీ లేదని..  అయితే తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తొలిరోజు నుంచి మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. 77 ఏళ్ల బైడెన్‌ మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరోనా నియమాలకు అనుగుణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ చిన్న చిన్న సమూహాలతో సభలను నిర్వహిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని