ఇరాన్‌  అణు పరిశోధనశాలలో ప్రమాదం
close

తాజా వార్తలు

Published : 04/07/2020 22:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇరాన్‌  అణు పరిశోధనశాలలో ప్రమాదం

 ఇజ్రాయిల్‌ సైబర్‌ దాడే కారణం?

జెరుసలేం: ఇరాన్‌లో యురేనియం శుద్ధి కర్మాగారం, క్షిపణుల తయారీ యూనిట్లలో గత వారం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. వీటికి ఇజ్రాయిల్‌ కారణమని కువైట్‌కు చెందిన అల్‌ జరీడా డెయిలీ పత్రిక కథనం వెలువరించింది.  ఇరాన్‌ యురేనియం శుద్ధి కార్యక్రమంలో ఇది అతిపెద్ద కుదుపుగా అభివర్ణించింది. దాదాపు 2నెలలు వెనక్కి పోయినట్లు పేర్కొంది.

టెహ్రాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని నాటంజ్‌ వద్ద ఇరాన్‌ అణుకార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ఇక్కడ దాదాపు 25 అడుగులతో లోతులో పటిష్ఠమైన కాంక్రీట్‌ బంకర్‌ ఉంది. లక్ష చదరపు మీటర్లలోని ఈ బంకర్లో అణు ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది. ఇక్కడ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ విశ్లేషిస్తోందని.. కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఇరాన్‌ పేర్కొంది. 

జూన్‌ 26వ తేదీన ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్‌35 స్టెల్త్‌ జెట్‌ పర్షియాలో బాంబుదాడి  చేసిందని ఆ పత్రిక పేర్కొంది. ఆ పత్రికలో వచ్చిన ఫొటో వచ్చిన ప్రదేశాన్ని బట్టి దానిని క్షిపణుల తయారీ కేంద్రంగా భావిస్తున్నారు. కానీ, దీనిని ఇజ్రాయిల్‌ అధికారులు ధ్రువీకరించలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని