close

తాజా వార్తలు

రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున మత్తు పదార్థాలను సీజ్‌ చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు వెల్లడించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దిల్లీ అంతటా విస్తరించిన ఈ డ్రగ్‌ సిండికేట్‌ నుంచి సుమారు 20 కిలోల కొకైన్‌ను సీజ్ చేశారు. దిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రల్లో ఉన్న ఈ సిండికేట్‌కు ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్‌, నైజీరియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా సహా పలు దేశాలతో సంబంధాలు ఉన్నాయి. 

ఈ ఆపరేషన్‌లో ఐదుగురు భారతీయులు సహా అమెరికా, ఇండోనేషియా జాతీయులు ఇద్దరు, నైజీరియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. కొకైన్‌ అంతర్జాతీయ రవాణాకు ఈ సిండికేట్‌ను నిందితులు గమ్య స్థానంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. భారతదేశంలో సీజ్‌ చేసిన మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ.100కోట్లు ఉంటుందని.. ఈ ముఠా నుంచి సీజ్‌ చేసిన మొత్తం మాదకద్రవ్యాల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని చెప్పారు. అటు ఆస్ట్రేలియాలోనూ అధికారులు నిర్వహించిన మాదకద్రవ్యాల వ్యతిరేక ఆపరేషన్‌లో 55కిలోల కొకైన్‌, 200 కిలోల ఇతర మత్తు పదార్థలను సీజ్‌ చేసినట్లు సమాచారం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.