
తాజా వార్తలు
భారత్‌లో కరోనా పరీక్షలు @14 కోట్లు
న్యూదిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండో, మూడో వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,118 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 94,62,810కి చేరింది. ప్రస్తుతం 4,35,603 యాక్టివ్ కేసులున్నాయి. 88,89,585 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ మరో 482 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,37,621కి చేరింది. ఇదిలా ఉంటే జులై 7న దేశవ్యాప్తంగా కోటి కరోనా పరీక్షలు చేయగా ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 14 కోట్లకు చేరడం గమనార్హం.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
