కొత్త కరోనా: చిక్కుకున్న  భారతీయులకు వసతి

తాజా వార్తలు

Published : 26/12/2020 00:40 IST

కొత్త కరోనా: చిక్కుకున్న  భారతీయులకు వసతి

దుబాయి: రూపం మార్చుకున్న కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కొత్త చిక్కుల్లోకి నెడుతోంది. బ్రిటన్‌లో ఇటీవల వెలుగుచూసిన ఈ కొత్త కొవిడ్‌ వైరస్ నేపథ్యంలో పలు దేశాలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో యూఏఈలో చిక్కుకున్న సుమారు మూడు వందల మంది ప్రవాసులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించేందుకు పలువురు ముందుకు వచ్చారు.

కొత్తరకం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి. ఉపరితల, జల, భూ మార్గాలలో పర్యాటకులు తమ దేశంలోకి ప్రవేశించటంపై ఆంక్షలు విధించాయి. సౌదీ, కువైట్ చేరేందుకు తమ తమ దేశాల నుంచి ప్రత్యక్ష విమానాలు లేనందున.. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌లో ఆగి అక్కడి నుంచి  వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ నిర్ణయంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. కాగా వీరిలో భారత్‌కు చెందిన వారే అధికంగా ఉన్నారని సమాచారం.

ఈ పరిస్థితుల్లో దుబాయ్‌ మర్కజ్‌ ‌ సెంటర్‌కు చెందిన వాలంటీర్ల విభాగం ‘ఇండియన్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌’ (ఐసీఎఫ్‌), స్థానిక నిర్మాణ సంస్థ ఆసా గ్రూపు సహకారంతో వారందరికీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు వెల్లడించింది.

ఇవీ చదవండి.. 

కరోనా కొత్త వేషం..

ఆ దేశాల్లోనూ కొత్త కరోనా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని