యూఎన్‌ అడ్వైజరీ కమిటీకి భారతీయ మహిళ

తాజా వార్తలు

Updated : 07/11/2020 21:50 IST

యూఎన్‌ అడ్వైజరీ కమిటీకి భారతీయ మహిళ

జెనీవా: ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి చెందిన మహిళకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ దౌత్యవేత్త విదిశా మైత్రా యూఎన్‌ అనుబంధంగా నడిచే ‘అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ బడ్జెటరీ క్వశ్చన్స్‌’ సలహాదారు కమిటీకి ఎంపికయ్యారు. యూఎన్‌లోని 193 సభ్యదేశాలతో కూడిన జనరల్‌ అసెంబ్లీ ద్వారా ఈ కమిటీకి సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యుల భౌగోళిక ప్రాతినిధ్యం, వ్యక్తిగత అర్హతలు, అనుభవాన్ని బట్టి ఎంపిక చేస్తారు. అందులో భాగంగా ఆసియా పసిఫిక్‌ దేశాల బృందం తరపున మైత్రాకు అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయని యూఎన్‌కు భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంతో కీలకమైన ఎన్నికలో భారత అభ్యర్థికి మద్దతుగా నిలిచిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ బృందంలో ఇరాక్‌కు చెందిన అలి మొహమ్మద్‌ ఫయిక్‌ అల్‌ దబాగ్‌ 64 ఓట్లు దక్కించుకున్నారు. ఈ కమిటీ బడ్జెటరీ అంశాలను చూసుకుంటుంది. ఈ విజయంతో విదిశా మూడేళ్ల కాలం ఈ పదవిలో కొనసాగనున్నారు. 2021 జనవరి ఆరంభం నుంచి భారత్‌ యూఎన్‌ భద్రతా మండలిలో రెండేళ్ల సభ్య దేశంగా కొనసాగనున్న తరుణంలో ఈ విజయం కూడా వరించడం విశేషం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని