భారతీయ అమెరికన్ల ఓట్లు నాకే.. ట్రంప్‌ ధీమా

తాజా వార్తలు

Updated : 05/09/2020 11:59 IST

భారతీయ అమెరికన్ల ఓట్లు నాకే.. ట్రంప్‌ ధీమా

రెండు కారణాలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లు తనవేనని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీ తన మిత్రుడని.. అంతేకాకుండా తను, తన కుటుంబం భారతీయులకెప్పుడూ మంచి మిత్రులే కావటంతో భారతీయుల సహకారం తమకెప్పుడూ ఉంటుందని ఆయన వివరించారు.

తనను తాను భారత్‌కు మంచి మిత్రుడిగా అభివర్ణించుకునే ట్రంప్‌.. శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘‘మోదీ మాకు మంచి మిత్రుడు. ఆయన నుంచి మాకు సహాయం లభిస్తుంది. అంతేకాకుండా  నా కుమార్తె ఇవాంకా ట్రంప్‌, కుమారుడు ట్రంప్‌ జూనియర్‌, ఆయన స్నేహితురాలు కింబర్లీలకు భారతీయుల్లో మంచిపేరుంది. భారతీయుల సెంటిమెంట్లు నాకు బాగా నచ్చుతాయి. మా పిల్లలు భారత్‌ గురించి తరచుగా అలోచిస్తారు. అదేవిధంగా భారత్‌ నుంచి కూడా మాకు సహకారం లభిస్తుంది. దీనితో ఇక్కడి భారతీయులు నాకే ఓటేస్తారు’’ అని వెల్లడించారు.
 

భారతీయులతో సన్నిహిత సంబంధాలు

ఇక ట్రంప్‌ కుమార్తె ఇవాంకా 2017లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేశారు. అమెరికా అధ్యక్షుడి కుటుంబం నుంచి మనదేశానికి వచ్చిన తొలి వ్యక్తి ఇవాంకా. అంతేకాకుండా ఆమె భారత్‌కు సంబంధించిన వ్యవహారాల పట్ల సామాజిక మాధ్యమాల్లో తరచుగా స్పందించటం కూడా కలసి వచ్చే అంశం. కాగా, ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా భారత్‌ను పలుమార్లు సందర్శించారు. అతని సన్నిహితురాలు, ట్రంప్‌ సలహాదారు కింబర్లీ గిల్ఫోయిల్ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని