చైనాతో మేం దృఢంగా వ్యవహరించాం: భారత్

తాజా వార్తలు

Published : 30/10/2020 18:27 IST

చైనాతో మేం దృఢంగా వ్యవహరించాం: భారత్

కరోనా మహమ్మారి సవాళ్లు విసిరినా..

దిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి దేశంలో అనేక సవాళ్లను విసురుతున్నప్పటికీ..సరిహద్దులో చైనాతో నెలకొన్న దశాబ్దాల సంక్షోభం పట్ల భారత్‌ పరిపక్వత, దృఢత్వంతో వ్యవహరించిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా అన్నారు.  ఒక వారం పాటు ఫ్రాన్స్, జర్మనీ, యూకేలో పర్యటించనున్న ఆయన పారిస్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఉగ్ర ఘటనలను ప్రస్తావించారు. వాటిలో ఒకదానికి పాకిస్థాన్‌లోనే మూలాలున్నాయని, నాగరిక సమాజం ఈ తీరుపై దృఢంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.  

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంకెయిస్‌ డెస్‌ రిలేషన్స్‌ ఇంటర్నేషనల్‌లో ష్రింగ్లా భౌగోళిక వ్యూహాత్మక సమస్యల గురించి మాట్లాడుతూ..తక్షణ సవాళ్లు భారత్‌ను సరిహద్దు వ్యూహాత్మక లక్ష్యాల నుంచి దూరంగా ఉండేలా చేయవని స్పష్టం చేశారు. ఇండో ఫసిపిక్‌ రీజియన్‌లో అన్ని దేశాలతో కలుపుకొనిపోయే తత్వంతో భారత్ ముందుకు కదులుతుందని వెల్లడించారు. అలాగే పాకిస్థాన్ వైపు నుంచి పొంచి ఉన్న సరిహద్దు ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ..‘పశ్చిమ సరిహద్దు వైపు పొంచి ఉన్న ముప్పునకు అడ్డుకట్ట వేసే చర్యలను భారత్ కొనసాగిస్తుంది’ అని చెప్పారు. ‘ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన రెండు ఉగ్రవాద ఘటనలు గురించి వినడం చాలా భయానకంగా అనిపించింది. అందులో ఒకదాని మూలాలు ఎప్పటిలాగే పశ్చిమాన ఉన్న పొరుగు దేశంలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా మేం ఆ పరిస్థితిని అనుభవిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఉన్న ఈ ముప్పును పరిష్కరించడానికి నాగరిక సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని