దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి

తాజా వార్తలు

Published : 25/12/2020 22:13 IST

దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలి

క్రిస్మస్‌ సందేశాన్ని వినిపించిన పోప్‌

వాటికన్‌ సిటీ: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ తన సందేశాన్ని వినిపించారు. ప్రపంచాన్ని కొవిడ్‌-19 అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ టీకాను అందరికీ అందుబాటులో ఉండేలా దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఏటా పోప్‌ తన సందేశాన్ని వేలాది మంది ప్రజల ముందు వినిపించేవారు. కరోనా నేపథ్యంలో వాటికన్‌ హాల్‌ ఆఫ్‌ ది బెనెడిక్షన్స్‌లో కేవలం 50 మంది వాటికన్‌ సిబ్బంది నడుమ పోప్‌ తన సందేశాన్ని వినిపించారు. ప్రజలు వర్చువల్‌గా ఆలకించారు.

కరోనా కారణంగా అనేక దేశాల్లో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తలకిందులైన నేపథ్యంలో పరస్పర సహకారం అందించుకోవాలని దేశాలకు పోప్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక స్థితి ఏర్పడిన ఈ తరుణంలో ‘టీకా జాతీయవాదాన్ని’ తరిమికొట్టాలన్నారు. ఈ విధమైన ధోరణి మారకుంటే పేద దేశాలు మహమ్మారి కోరల్లో చిక్కుకుపోతాయన్నారు. ‘‘ఆరోగ్యం కోసం కృషి చేయడం ఒక పోటీ కాదు. అందరూ ఈ సమయంలో టీకాను సమానంగా పొందే అర్హత ఉన్నవారే. నేను దేశాధినేతలను, అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటున్నా. ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు అందేలా చూడండి’ అని పోప్‌ కోరారు. జాతీయతలను దాటి అందరూ ఒకే కుటుంబంలా జీవించాలని పోప్‌ ఆకాంక్షించారు. 

మాస్కులు ధరించని వ్యక్తుల వల్లే అమెరికా వంటి దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరిగిందని పోప్‌ అన్నారు. క్రిస్మస్‌, నూతన సంవత్సర సమయాల్లో ఇటలీ ప్రజలంతా లాక్‌డౌన్‌లో ఉండాల్సి రావడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బలహీనులకు, రోగులకు, నిరుద్యోగులకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి అని పోప్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

రజనీ ఆరోగ్యంపై అపోలో తాజా బులెటిన్‌

సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని