close

తాజా వార్తలు

Updated : 05/12/2020 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తొలి టీకానే ఉత్తమం కానవసరం లేదు..

దిల్లీ: దేశంలో అందుబాటులోకి రానున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్లలో  ఏది ఉత్తమమో, ఏది అన్ని విధాల సరిపడేదో తెలుసుకునేందుకు అనేక వ్యాక్సిన్లను పరీక్షించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీఓబీ) సెక్రటరీ రేణు స్వరూప్‌ సూచించారు. వివిధ సంస్థలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాలు వేటికవే తమవైన లాభనష్టాలను కలిగి ఉన్నాయన్నారు. మొట్టమొదట లభించిందే ఉత్తమమైనది కావాల్సిన అవసరం లేదని.. తరువాత అందుబాటులోకి వచ్చే టీకా మరింత మంచిదయ్యే అవకాశం లేకపోలేదని  ఆమె విశ్లేషించారు. వాటిలో ఏది మంచిదనేది ఇప్పుడే వెల్లడించటం కష్టసాధ్యమని వివరించారు.

ఓ ఆన్‌లైన్‌ సెమినార్‌ సందర్భంగా డీఓబీ సెక్రటరీ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 30 కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు కొనసాగు తున్నాయన్నారు. వాటిలో  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మూడో దశ ప్రయోగాల్లో ఉండగా.. భారత్‌ బయోటెక్‌ కూడా మూడోదశ ప్రయోగాల్లోకి ప్రవేశించిందని అధికారిణి వివరించారు. మరో ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలాకు ఇటీవలే అనుమతులు లభించాయి.

వ్యాక్సిన్‌తయారీ అనేది నిజానికి సంక్లిష్టమైన విధానమని.. ఇందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైతుందని రేణు స్వరూప్‌ అన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలను గమనించేందుకు డీబీటీ దేశ, విదేశాలకు చెందిన ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిందని ఆమె తెలిపారు. ఈ కమిటీ ప్రతి రెండు వారాలకు ఒకసారి సమావేశమై దేశంలో కొవిడ్‌ టీకా పురోగతిని గురించి సమీక్ష జరుపుతుందని తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని