యూఏఈలో భారీ అగ్నిప్రమాదం!

తాజా వార్తలు

Updated : 06/08/2020 14:35 IST

యూఏఈలో భారీ అగ్నిప్రమాదం!

కూరగాయల మార్కెట్‌ ఆహుతి, తప్పిన ప్రాణాపాయం

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అజ్మన్‌ కూరగాయల మార్కెట్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పల్ప వ్యవధిలోనే మార్కెట్‌ మొత్తం వ్యాపించాయి. విషయం తెలిసిన మూడు నిమిషాల్లోనే దాదాపు 25 అగ్నిమాపక బృందాలు అక్కడకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్‌ చుట్టుపక్కల ఉన్న నివాసప్రాంత ప్రజలను అక్కడ నుంచి తరలించారు. భారీ సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకొని సుమారు మూడు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దుబాయ్‌, షార్జా నుంచి కూడా ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, కొవిడ్‌ కారణంగా గత నాలుగు నెలలుగా ఆ మార్కెట్‌ మూసివున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

అయితే, భారీ అగ్నిప్రమాదంతో నగరంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బీరుట్‌లో భారీ పేలుళ్ల ఘటన మరువకముందే ఇది సంభవించడంతో అక్కడి ప్రజలు తొలుత భయానికి గురయ్యారు. చివరకు మార్కెట్‌లో అగ్నిప్రమాదం అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని