కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌పై అత్యవసర సమావేశం!

తాజా వార్తలు

Updated : 21/12/2020 04:39 IST

కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌పై అత్యవసర సమావేశం!

దిల్లీ: యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ విషయమై చర్చించేందుకు కొవిడ్‌-19 జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ)ను సోమవారం అత్యవసర సమావేశానికి పిలిచింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘ఆరోగ్య సేవల డీజీ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌(జేఎంజీ) అత్యవసరంగా భేటీ కానుంది. కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ గురించి వారు ఈ సమావేశంలో చర్చించనున్నారు’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మానిటరింగ్(జేఎంజీ) గ్రూప్‌లో డబ్ల్యూహెచ్‌వో భారత ప్రతినిధి రోడరికో ఓఫ్రిన్‌ ఉన్నారు. ఆయన కూడా సోమవారం సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

కాగా యూకేలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు దేశాలు ఆందోళన మొదలైంది. ఇప్పటికే బెల్జియం, నెదర్లాండ్‌ దేశాలు బ్రిటన్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి. జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తోంది. ఈ వైరస్‌ స్ట్రెయిన్‌ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు.  

ఇదీ చదవండి

కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌.. పలు దేశాల్లో కలవరం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని