ఆ వయస్సువారిలోనే కరోనా కేసులు అధికం!

తాజా వార్తలు

Updated : 02/09/2020 15:19 IST

ఆ వయస్సువారిలోనే కరోనా కేసులు అధికం!

దేశంలో 77శాతానికి చేరిన రికవరీ

దిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 70వేలకు పైగా ప్రజలు కొవిడ్‌ బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువగా యువకులు, మధ్య వయస్సువారే ఉంటున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 54శాతం 18-44 ఏళ్ల వయస్సువారే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా మరణాల్లో 51శాతం మంది 60ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి సమయంలో వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు పౌరులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం, మాస్కులు/ఫేస్‌ కవర్లు తప్పకుండా వాడాలని సూచించింది. ఏయే వయస్సువారిలో ఎంతశాతం పాజిటివ్‌ కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయో వివరాలు ఇలా ఉన్నాయి.

*17ఏళ్లలోపు పిల్లల్లో 8శాతం కేసులు, ఒక శాతం మరణాలు నమోదవుతున్నాయి. 

*18-25 ఏళ్ల వయస్సువారిలో 14శాతం కేసులు, ఒకశాతం రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

*26-44 వయస్సు వారిలో అత్యధికంగా 40శాతం కేసులు బయటపడుతుండగా, 11శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 

*45-60ఏళ్ల మధ్య వయస్కుల్లో మరణాలు సంఖ్య అధికంగా ఉంటోంది. వీరిలో 26శాతం కేసులు, 36శాతం మరణాలు ఉంటున్నాయి.

*60ఏళ్ల వయస్సు పైబడినవారిలో 12శాతం కేసులు బయటపడుతున్నాయి. వీరిలో అత్యధికంగా 51శాతం మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య 37లక్షలు దాటగా వీరిలో ఇప్పటివరకు 66వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటికే 29లక్షల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని