close

తాజా వార్తలు

Published : 01/12/2020 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిన్న దిల్లీ.. నేడు గుజరాత్‌!

ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష ధరలు తగ్గింపు 

దిల్లీ: కరోనా వైరస్‌ నిర్ధారణకు చేసే ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష రుసులను తగ్గిస్తూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేస్తున్నాయి. నిన్న దిల్లీ ప్రభుత్వం రూ.2400లుగా ఉన్న ధరను రూ.800లకు భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఒక్కో టెస్ట్‌కు 1500లుగా ఉన్న ధరను రూ.800లకు తగ్గిస్తున్నట్టు డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ వెల్లడించారు. 

టెస్ట్‌ కిట్ల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆర్టీ పీసీఆర్‌ పరీక్షకు రూ.800ల చొప్పున వసూలు చేస్తారన్నారు. మొత్తం ధరపై 700 తగ్గించినట్టు చెప్పారు. ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్స్‌ సేకరించేందుకు గతంలో రూ.2వేలుగా ఉన్న ధరను రూ.1100కు తగ్గించినట్టు చెప్పారు.  ఇప్పటికే దిల్లీతో పాటు రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష ధరలను తగ్గిస్తూ  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని