close

తాజా వార్తలు

Published : 23/01/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంగనా చెప్పింది కరెక్ట్‌: నిర్భయ తల్లి

దిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి కృతజ్ఞతలు చెప్పారు. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపారు. దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి సమర్థించారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని అన్నారు.  

‘కంగనా వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆమె చెప్పింది. కరెక్ట్‌. నాకు అండగా నిలిచి ఇందిరాజైసింగ్‌ వ్యాఖ్యలను ఖండించినందుకు చాలా సంతోషంగా ఉంది. కంగనా చెప్పినట్లుగా అత్యాచార దోషులను బహిరంగంగా ఉరి తీయాలనే మాటలను నేను సమర్థిస్తాను’ అని ఆమె అన్నారు. తన కూతురు పట్ల జరిగిన దారుణం వల్ల పడిన బాధ ఏంటో తనకే తెలుసునని ఆమె అన్నారు. ‘ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ఈ మానవహక్కుల కోసం పోరాడే వాళ్లు ఎటుపోయారు? ఇటువంటి వాళ్లు మానవ హక్కుల పేరిట సమాజాన్ని మోసం చేస్తున్నారు. యువతుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మానవ హక్కుల పేరిట వ్యాపారం చేస్తూ నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నారు’ అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. నిర్భయ దోషులను క్షమించమనేందుకు ఆమె ఎవరు? అని నిర్భయ తల్లి గతంలో ప్రశ్నించారు. తాజాగా ఇందిరా జైసింగ్‌ వ్యాఖ్యలను కంగనా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాళ్లే రాక్షసులకు జన్మనిస్తారని ఆమె మండిపడ్డారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.