close

తాజా వార్తలు

పోలింగ్‌ బూత్‌ వద్ద కాల్పులు

రాంచీ: ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడానికి దుండగులు యత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. సిసాయి నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 36లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఏడీజీపీ మీనా స్పందించారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగులపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఐదు దశల పోలింగ్‌లో భాగంగా ఈ దశలో 20 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.