నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌

తాజా వార్తలు

Updated : 09/09/2020 16:28 IST

నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్‌ శాంతి బహుమతి-2021కి నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయిల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ఆయన పేరును నామినేట్‌ చేశారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా కృషిచేశారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలను ట్రంప్‌ పరిష్కరించారంటూ ప్రశంసించారు. మధ్య ప్రాచ్యం నుంచి భారీ సంఖ్యలో అమెరికా దళాలను ట్రంప్‌ ఉపసంహరించుకొనేలా చేశారన్నారు. అయితే, ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయనకు మద్దతుగా ట్రైబిడ్రే జెడ్డే మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఆయన పేరును నామినేట్‌ చేశారు. అయితే, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేయడం గమనార్హం.

2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి పొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారానికి అసాధారణ కృషికి గాను ఆయనకు ఈ విశిష్ట పురస్కారం దక్కింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని