close

తాజా వార్తలు

Published : 03/08/2020 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో 266 మంది మృత్యువాత

దిల్లీ: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 8,968 కొత్త కేసులు వెలుగుచూశాయి. 10,221 మంది డిశ్చార్జి అయ్యారు. 266 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 4,50,196కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 2,87,030 మంది కోలుకోగా, 15,842 మంది మరణించారు.  ప్రస్తుతం 1,47,018 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా 41,644 యాక్టివ్‌ కేసులు పుణె నగరంలోనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు తాజాగా బృహన్‌ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) ఆగస్టు 5 నుంచి మిషన్‌ బిగిన్‌ ఎగెయిన్‌ పేరుతో మాల్స్‌, మార్కెట్ కాంప్లెక్సులు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు తెరిచేందుకు అనుమతించింది. అయితే వీటిలో ఉండే సినిమాహాళ్లు, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లకు మాత్రం అనుమతి నిరాకరించింది. ప్రత్యేక వంటగది సదుపాయం ఉన్న రెస్టారెంట్లు హోం డెలివరీ ఇచ్చేందుకు మాత్రం అనుమతించింది. 

* మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరో రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 5,609 కేసులు నమోదయ్యాయి. 109 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,63,222కి చేరింది. వీరిలో 2,02,283 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 4,241 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 58,211 నమూనాలను పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

*దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 805 కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా 17 మంది మృత్యువాత పడ్డారు. అలానే 937 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు దిల్లీ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,38,482కి చేరుకుంది. ఇందులో 1,24,254 మంది కోలుకోగా, 4021 మంది మరణించారు. ఇప్పటి వరకు 10,73,802 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

*గడచిన 24 గంటల్లో కర్ణాటకలో 4,752 కొత్త కేసులు వెలుగుచూశాయి. 98 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,39,571కి చేరుకోగా, 62,500 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 2,594 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 74,469 కేసులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సోకడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పరిస్థితి మెరుగ్గానే ఉందని సదరు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.