సిసోడియా ఇంటిపై దాడి.. ఖండించిన ఆప్‌

తాజా వార్తలు

Published : 10/12/2020 22:57 IST

సిసోడియా ఇంటిపై దాడి.. ఖండించిన ఆప్‌

దిల్లీ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా నివాసంపై గురువారం భాజపా కార్యకర్తలు దాడికి దిగినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ్‌ చద్దా సంచలన ఆరోపణలు చేశారు. ‘పోలీసుల సమక్షంలోనే భాజపాకు చెందిన కొందరు వ్యక్తులు సిసోడియా నివాసంపై దాడికి దిగారు. సిసోడియా ఇంట్లో లేని సమయంలో భాజపా కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించి ధ్వంసం చేశారు’ అని ఆరోపించారు. కాగా ఆప్‌ నాయకులు తమ మేయర్లను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలు అంతకుముందు సిసోడియా ఇంటి సమీపంలో ధర్నాకు దిగారు.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం సిసోడియా నివాసంపై దుండగులు దాడి చేశారంటూ.. ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘సిసోడియా లేని సమయంలో పోలీసుల సమక్షంలోనే దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. దిల్లీలో రోజురోజుకు భాజపా ఎందుకు నిరాశకు గురవుతోంది?. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులకు పాల్పడటం ఆందోళన కలుగజేస్తోంది. ఈ ఘటనపై బాధ్యత వహించి తక్షణ విచారణ చేపట్టాలి. పోలీసుల సమక్షంలోనే దుండగులు సిసోడియా ఇంటిలోకి దూసుకెళ్లిన వీడియోలు చూశాక ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యా’ అని కేజ్రీవాల్‌ అన్నారు. కాగా ఆప్‌ నాయకుల ఆరోపణలపై దిల్లీ పోలీసులు స్పందించాల్సి ఉంది. 

కాగా ఆప్‌ వ్యాఖ్యలపై దిల్లీ భాజపా ఉపాధ్యక్షుడు అశోక్‌ గోయెల్‌ స్పందిస్తూ.. ‘భాజపా మేయర్లను చంపే కుట్రకు తెరతీసిన ఆప్‌.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు యత్నిస్తోంది’ అని ఆరోపించారు. 

ఇదీ చదవండి

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని