దిల్లీ ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 14/09/2020 20:53 IST

దిల్లీ ఉపముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సోమవారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఆయన తనంతట తానే ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

‘ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఎలాంటి జ్వరం ఇతర లక్షణాలూ లేవు. మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే కోలుకుని మళ్లీ విధుల్లోకి వస్తా’ అంటూ వెల్లడించారు. కాగా దిల్లీలో ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో 1.88వేల మంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం 28వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు దిల్లీ వైద్యశాఖ వెల్లడించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని