close

తాజా వార్తలు

Published : 09/08/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక 101 రక్షణ వస్తువులపై నిషేధం!

ఇకనుంచి అవి భారత్‌లోనే తయారీ 
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి
‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం: ప్రభుత్వం

దిల్లీ: దేశంలో 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్’‌కు ఊతమివ్వడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఆయుధ సంపత్తి సహా రక్షణశాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల(2020- 2024)కాలంలో ఈ రక్షణ రంగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. శతఘ్నులు, రైఫిళ్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, రాడార్ల వంటి వాటిని ఇకనుంచి దిగుమతి చేసుకోమని రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాలను రాజ్‌నాథ్ సింగ్‌ ఈరోజు‌ ట్విటర్‌లో వెల్లడించారు.

దీనిలో భాగంగా సాయుధ దళాల అవసరాలను గుర్తించి వాటిని రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామని, ఇక నుంచి వీటిని దేశీయంగానే తీర్చటానికి వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 101ఉత్పత్తులతో జాబితా సిద్ధం చేశామని, మరిన్ని రక్షణ పరికరాలను గుర్తించి వాటిపై కూడా నిషేధం విధిస్తామన్నారు. రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దులుగా విభజించామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నిషేధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇక్కడి పరిశ్రమలకు గడువు ఇస్తామని తెలిపారు. తాజా నిర్ణయం భారత రక్షణ పరిశ్రమకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ఉత్పత్తికి సంబంధించి శక్తిసామర్థ్యాలను నిపుణులు, తయారీ సంస్థలతో సుదీర్ఘంగా చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. కొత్త ఉత్పత్తులతో సొంత నమూనాలతోపాటు అభివృద్ధి సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు అవకాశం పెరుగుతుందని రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2015సంవత్సరం నుంచి 2020వరకు దాదాపు 230 పరికరాల కోసం దాదాపు రూ.3.35 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రానున్న 6నుంచి 7 సంవత్సరాల్లో దాదాపు 7లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను దేశీయ పరిశ్రమతోనే కుదుర్చుకుంటామని తెలిపారు. వీటిలో లక్షా 30వేల కోట్ల చొప్పున ఆర్మీ, వైమానిక దళాలకు సంబంధించినవి ఉండగా, మరో లక్షా 40వేల కోట్లు విలువైన వస్తువులు నావికా దళానికి చెందిన ఉత్పత్తులు ఉండనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.