హారిస్‌ ఎంట్రీ.. ఒక్క రోజే భారీగా నిధులు

తాజా వార్తలు

Published : 13/08/2020 23:58 IST

హారిస్‌ ఎంట్రీ.. ఒక్క రోజే భారీగా నిధులు

న్యూయార్క్‌: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ పోటీపడనున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడెన్‌..తనతో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమలా హారిస్‌ను ఎంచుకున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన ఒక్క రోజులోనే జో బైడెన్‌ ప్రచారానికి మద్దతుగా భారీగా నిధులు సమకూరాయి. 24 గంటల్లో సుమారు 26 మిలియన్ డాలర్ల నిధులు అందాయి. ఈ మొత్తం గతంలో సమీకరించిన ఒక రోజు మొత్తం కంటే రెట్టింపు అని, డెమోక్రాట్లను ప్రజలు ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

జో బైడెన్‌ ప్రచారానికి ఆయన తరపున నిధుల సమీకరణలో కీలకంగా వ్యవహరిస్తున్న కమలా హారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమ ప్రచారానికి మద్దతుగా పెద్ద మొత్తంలో నిధులు రావడం తనకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని జో బైడెన్‌ పేర్కొన్నారు. డెమోక్రటిక్‌ పార్టీకి కల్పతరువుగా భావించే కాలిఫోర్నియాలో కమలా హారిస్‌కు బలమైన దాతలు ఉన్నారు. అలానే హారిస్‌కు భారత్, ఆఫ్రికన్‌ మూలాలు ఉండంటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని