ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌

తాజా వార్తలు

Published : 25/12/2020 18:08 IST

ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌

హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా శుక్రవారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఈ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ అభివృద్ధి పనుల వివరాలను ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. భారత్‌లో తయారు చేస్తున్న ఈ టీకా పంపిణీ ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా పాల్గొన్నారు. కొవాగ్జిన్‌ టీకాను భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీకా మూడోదశ ప్రయోగ పరీక్షల్లో ఉంది. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను భారత్‌ బయోటెక్‌ బీఎస్‌ఎల్‌-3 (బయో సేఫ్టీ లెవెల్‌-3) బయో కంటైనేషన్‌ సదుపాయంతో తయారు చేస్తున్నారు. ఈ చర్చలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వదేశీ ఉత్పత్తులు  ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం మెరుగవ్వాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించి కొవాగ్జిన్‌ అభివృద్ధి పనులను సమీక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని