close

తాజా వార్తలు

Published : 27/09/2020 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

60లక్షలకు చేరువలో కరోనా కేసులు!

24గంటల్లో 88వేల కేసులు, 1124 మరణాలు!
దేశవ్యాప్తంగా 49లక్షల మంది రికవరీ

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుతోంది. నిత్యం 85వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 9,87,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 88,600 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 59లక్షల 92వేలకు చేరింది. ఇప్పటివరకు 49లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో నిన్న ఒక్కరోజే 92వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రోజువారీ పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం మరో 9లక్షల 56వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం దాదాపు 1100మందికిపైగా ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మరో 1124 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య 94,503కు చేరింది. అయితే, ఈ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 82.46శాతంగా ఉండగా, మరణాల రేటు 1.58శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరువకాగా అమెరికాలో ఈ సంఖ్య 70లక్షలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 2లక్షల 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.