close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనా కాటుకు మరో 150 మంది బలి

చైనా వెలుపల పెరుగుతున్న కేసులు

బీజింగ్‌: కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం ఇంకా తగ్గినట్లు కన్పించట్లేదు. ఈ వైరస్‌ కారణంగా చైనాలో మరో 150 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 2,592కు పెరిగింది. మరోవైపు కొత్తగా 409 మందిలో కరోనా గుర్తించినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇక తాజాగా మరణించిన వారిలో ఒక్కరు మినహా మిగతా మొత్తం హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందినవారే. 

* కరోనా పుట్టుకొచ్చిన వుహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ బృందం నగరంలోని ఆసుపత్రులను సందర్శించి వైరస్‌ తాజా పరిస్థితిని పరిశీలిస్తోంది. 

* ఇక వైరస్‌ లేదని నిర్ధారణ అయిన వ్యక్తులు వుహాన్‌ నగరం నుంచి వెళ్లిపోయేందుకు చైనా అధికారులు అనుమతినిచ్చారు. 

* చైనా వెలుపల కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశం దక్షిణకొరియా. ఇక్కడ తాజాగా మరో 161 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 763కు పెరిగింది. ఎక్కువ కేసులు డేగు నగరంలో నమోదయ్యాయి. ఇక ఈ దేశంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది.

* ఇటలీలో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 152 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.  

* చైనా పర్యాటకులపై న్యూజిలాండ్‌ విధించిన నిషేధాన్ని పొడగించింది. మరో ఎనిమిది రోజుల పాటు చైనా పర్యాటకులు దేశంలోకి రాకుండా ఆంక్షలు విధించినట్లు ఆ దేశ ప్రధాని జెసిండా వెల్లడించారు. 

* కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి పడిపోయాయి. సోమవారం దాదాపు 3శాతం తగ్గాయి. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.