
తాజా వార్తలు
ఆస్ర్టేలియాకు క్షమాపణ చెప్పడానికి నిరాకరణ
బీజింగ్ : అఫ్గానిస్థాన్‌లో ఓ బాలుడిని ఆస్ట్రేలియా సైనికుడు చంపుతున్నట్టు ఉన్న ఫొటోను ఇటీవల చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ట్వీట్ చేశారు. ఇది చైనా, ఆస్ట్రేలియా మధ్య వివాదానికి కారణమైంది. ఈ ట్వీట్‌పై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో అసహ్యకరమైన ట్వీట్ అని చైనా వెంటనే దాన్ని తొలగించాలన్నారు. నకిలీ ఫొటోతో ఉన్న ట్వీట్ పెట్టినందుకు ఆ దేశం క్షమాపణలు చెప్పాలని సోమవారం ఆయన డిమాండు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇలా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన చైనా.. ఆస్ర్టేలియాకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించింది. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నందుకు క్షమాపణ కోరడం కాదు.. ఆస్ట్రేలియా సిగ్గుపడాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. ’మా విదేశాంగ శాఖ సహచరులు పెట్టిన ట్వీట్‌పై ఆస్ట్రేలియా ఎందుకో తీవ్రంగా స్పందించింది. జాలి లేకుండా ఆస్ట్రేలియా సైనికులు అఫ్గాన్ పౌరులను చంపడం సమంజసమేనా’ అని ఆమె ప్రశ్నించారు. కాగా అఫ్గానిస్థాన్‌లో తమ దేశం సైనికులు చేసిన అకృత్యాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వమే దర్యాప్తు జరుపుతోంది. 2009-13 మధ్య అఫ్గాన్ పౌరుల హత్యలో వారికి ప్రమేయం ఉన్నట్టు ఆస్ట్రేలియా గుర్తించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ముక్క కొరకలేరు!
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
