
తాజా వార్తలు
US రహస్యాలు దోచేస్తున్న చైనా!
అమెరికా టాప్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపణ
వాషింగ్టన్: స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఘర్షణకు దిగుతోందని పేర్కొన్నారు. అగ్రరాజ్యం రహస్యాలను దొంగిలించి ఎదగాలని, మార్కెట్లో యూఎస్ సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో వెల్లడించారు.
అమెరికా మేధో హక్కులను దొంగిలించడంతోనే ట్రంప్ సర్కారు చైనా వస్తువులు, ఉత్పత్తులపై విపరీతమైన పన్నులు, టారిఫ్‌లు విధించిందని ర్యాట్‌క్లిఫ్ అన్నారు. ‘అమెరికానే కాదు ప్రపంచం మొత్తం మీద ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగానే అనేక చైనా కంపెనీలు పనిచేస్తాయి. అందులో పనిచేసే కార్మికులను అడ్డుగా పెట్టుకొని డ్రాగన్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకొనేలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన ఆరోపించారు. త్వరలో గద్దెనక్కనున్న బైడెన్ ప్రభుత్వాన్ని ప్రభావం చేసేందుకు డ్రాగన్‌దేశం ఆసియాపై సైనికదాడికి దిగే అవకాశముందని హెచ్చరించారు.
‘అమెరికాతో బహిరంగ ఘర్షణకు దిగాలని చైనా అనుకుంటోంది. ఇందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉండాలి. నాయకులు విడిపోకుండా ఐక్యతతో ముప్పును గ్రహించాలి. దాని గురించి మాట్లాడాలి. పరిష్కారానికి సిద్ధంగా ఉండాలి’ అని ర్యాట్క్లిప్ రాశారు. కాగా ఆయన వ్యాఖ్యలను చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి హువా చునియింగ్ విభేదించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
