close

తాజా వార్తలు

Published : 07/07/2020 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడో ద‌శ‌కు చైనా వ్యాక్సిన్‌!

తుది ద‌శ ప్రయోగాల‌కు సిద్ధ‌మైన‌ సినోవాక్ బ‌యోటెక్
ఈనెల‌ బ్రెజిల్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డి

లండ‌న్‌: క‌రోనావైర‌స్‌ను ఎదుర్కోవ‌డం కోసం చైనా సినోవాక్ బ‌యోటెక్ త‌యారుచేస్తోన్న వ్యాక్సిన్ మూడో ద‌శకు చేరుకున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌ బ్రెజిల్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం చైనా కంపెనీ సినోవాక్ బ్రెజిల్‌కి చెందిన‌ వ్యాక్సిన్ త‌యారీదారు 'ఇన్‌స్టిట్యూటో బూటాన్‌ట‌న్'‌తో క‌లిసి ప‌నిచేయ‌నుంది. దీనిలోభాగంగా జులైలో మూడోద‌శ ట్ర‌య‌ల్స్‌ ప్రారంభించ‌డానికి దాదాపు 9వేల మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోనుంది. జ‌న‌వ‌రి చివ‌ర‌లోనే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీని ప్రారంభించిన సినోవాక్ బ‌యోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ ప్లాంటును సిద్ధం చేస్తోంది. సంవ‌త్స‌రానికి ప‌దికోట్ల డోసుల‌ను త‌యారుచేసే సామ‌ర్థ్యం క‌లిగిన ఈ ప్లాంటు ఈ సంవ‌త్స‌రం చివ‌రినాటికి పూర్తికానుంది.

ఇప్ప‌టికే ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారుచేసిన వ్యాక్సిన్‌తోపాటు 'చైనా జాతీయ ఫార్మా బృందం(సినోఫార్మ్‌)' త‌యారుచేసిన వ్యాక్సిన్‌లు మూడోద‌శ ప్ర‌యోగ‌స్థాయికి చేరుకున్నాయి. మ‌రో సంస్థ మోడెర్నా కూడా ఈ నెల‌లోనే తుది ద‌శ ప్ర‌యాగాల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌రకు 19 వ్యాక్సిన్‌లు మాన‌వ‌ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్న‌ట్లు ప్రపంచ ఆరోగ్య‌సంస్థ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. భార‌త్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్‌, జైడ‌స్‌ క్యాడిలా కూడా మొద‌టి, రెండో ద‌శ ప్ర‌యోగ ద‌శ‌ల‌కు చేరుకున్నాయి.

ఇవీ చ‌ద‌వండి..
ఆగ‌స్టు 15నాటికి క‌రోనా వ్యాక్సిన్‌? 
ఈ ఏడాది క‌రోనా వ్యాక్సిన్ క‌ష్ట‌మే: సీసీఎంబీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని