అక్టోబర్‌ చివరికి వ్యాక్సిన్‌ కష్టమే..

తాజా వార్తలు

Published : 04/09/2020 11:12 IST

అక్టోబర్‌ చివరికి వ్యాక్సిన్‌ కష్టమే..

సందేహం వ్యక్తం చేసిన ఫౌచీ

వాషింగ్టన్: ఈ అక్టోబర్‌ చివరికల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటం కష్టమేనని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచి అభిప్రాయపడ్డారు. అయితే అది అసాధ్యమేమి కాదని ఆయన అంటున్నారు. కాగా, 2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని ఆయన ఇదివరకు వెల్లడించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపు ప్రపంచం సాధారణ పరిస్థితికి చేరుకోగలదని కూడా ఆయన అంచనా వేశారు. అయితే కరోనా కట్టడిలో నిపుణుల మార్గదర్శకాలను సరిగా పాటించకపోతే... దాని ప్రభావం మరి కొన్నాళ్ల పాటు ఎదుర్కోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అమెరికాలో నవంబర్‌ 1 కల్లా అందుబాటులోకి రానుందని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా దానిని ప్రజలకు పంపిణీ చేసేందుకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఊహించిన దాని కంటే ముందే అందుబాటులోకి వచ్చే అవకాశముందా అని ఫౌచిని ఓ ఇంటర్వూలో ప్రశ్నించారు. అక్టోబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కొందరు భావిస్తున్నారని... అయితే తాను అలా అనుకోవటం లేదని ఆయన జవాబిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని