close

తాజా వార్తలు

Published : 04/08/2020 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుశాంత్‌ కేసు.. సీబీఐ విచారణకు సిఫార్సు

పట్నా : బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుపై ముంబయి పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విచారణను సీబీఐకి అప్పగించాలని బిహార్‌ ప్రభుత్వం సిఫార్సు చేయడం గమనార్హం. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బిహార్‌ ప్రభుత్వాన్ని తాజాగా కోరారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘సుశాంత్‌ తండ్రితో బిహార్‌ డీజీపీ ఈ ఉదయం మాట్లాడారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. దీంతో మేం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నాం’ అని సీఎం నితీశ్‌కుమార్‌ జాతీయ మీడియాతో అన్నారు. ప్రస్తుతం ముంబయి, బిహార్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేర్వేరుగా చేపడుతున్నారు.

ముంబయి పోలీసుల విచారణ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన సుశాంత్‌ తండ్రి.. సోమవారం ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి జీవితం ప్రమాదంలో ఉందని ఈ ఏడాది ఫిబ్రవరి 25న తాను బంద్రా పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.