వీరే నాకు అండా దండ.. బైడెన్‌

తాజా వార్తలు

Updated : 02/11/2020 16:42 IST

వీరే నాకు అండా దండ.. బైడెన్‌

విరాళాలందించిన భారతీయ అమెరికన్ల జాబితా ప్రకటన

వాషింగ్టన్‌: అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికల నిధుల సమీకరణలో తనకు అండగా నిలచిన దాతల జాబితాను విడుదల చేశారు. వీరిలో గవర్నర్లు, సెనేటర్లు, క్యాబినెట్‌ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులు, హాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారు. నవంబర్‌ 3న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి గాను విరాళాలు అందజేసిన 800 మందితో కూడిన ఈ జాబితాలో పదుల సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఉండటం గమనార్హం.

అగ్రరాజ్యంలోని భారతీయులు తనకు మద్దతుగా నిలిచి.. తమ పార్టీకి సుమారు లక్ష డాలర్ల  మేరకు ఆర్థిక సహాయం అందించారని బైడెన్‌ ఈ సందర్భంగా వివరించారు. వారిలో స్వదేశ్‌ ఛటర్జీ, రమేశ్‌ కపూర్‌, శేఖర్‌ ఎన్‌ నరసింహన్‌, ఆర్‌ రంగస్వామి, అజయ్‌ జైన్‌ భుటోరియా, ఫ్రాంక్‌ ఇస్లాం తొలి వరుసలో ఉన్నారు. మరికొందరు ప్రముఖుల్లో  నీల్‌ మఖీజా, రాహు, ప్రకాశ్‌, దీపక్‌ రాజ్‌, రాజ్‌ షా, రాజన్‌ షా, రాధికా షా, జిల్‌ సింగ్‌, రాజ్‌ సింగ్‌, నిధి థాకర్‌, కిరణ్‌ జైన్‌, సోనీ కాల్సి, బేలా బజారియా తదితరులు ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.

అయితే నాటి అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌లతో పోలిస్తే.. పదివేల డాలర్ల కంటే అధికంగా విరాళమిచ్చిన భారతీయ అమెరికన్ల సంఖ్య ఈసారి చాలా తక్కువ. క్రమం తప్పకుండా డెమొక్రాటిక్‌ పార్టీకి విరాళాలిస్తూ వస్తున్న ఆతిథ్య రంగ ప్రముఖుడు సంత్‌ ఛత్వాల్‌ తదితరులు ఈసారి మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే డెమొక్రాటిక్‌ పార్టీకి 700 అమెరికన్‌ డాలర్ల విరాళం లభించింది. అయితే రెండు సంవత్సరాల వ్యవధిలో ఒక బిలియన్‌ డాలర్ల విరాళాలు పోగుచేయగలిగిన తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ రికార్డు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని