
తాజా వార్తలు
200మీ: పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్
దిల్లీ: జమ్మ కశ్మీర్లో ఇటీవల భద్రతాదళాల ఎన్కౌంటర్లో హతమైన పాక్ ఉగ్రవాదుల చొరబాటు మార్గంపై బీఎస్ఎఫ్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ద్వారం పాక్‌లో ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు తాజాగా బీఎస్ఎఫ్ బృందం అందులోకి వెళ్లొచ్చినట్లు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా స్పష్టం చేశారు.
‘ఉగ్రవాదుల చొరబాటు పాల్పడిన సొరంగ ఆరంభ మార్గాన్ని కనుగొనేందుకు బీఎస్ఎఫ్ బృందం బయలుదేరింది. అందులో భాగంగా వారు సొరంగం వెంట 200 మీటర్ల మేర పాక్ భూభాగంలోకి ప్రయాణించారు. ఆ సొరంగం ప్రారంభ ద్వారం పాక్‌లో ఉన్నట్లు గుర్తించారు. బీఎస్ఎఫ్ బృందం తిరిగి వచ్చేటప్పుడు సాక్ష్యాధారాల కోసం అందులోని దృశ్యాల్ని రికార్డు చేసి తీసుకువచ్చారు’ అని ఆస్తానా తెలిపారు.
కాగా జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటాలో నవంబర్ 19న నలుగురు పాక్‌కు జైషే ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల చొరబాటు విషయమై బీఎస్ఎఫ్, ఇంటలిజెన్స్, కశ్మీర్ పోలీసులు విచారణ చేపట్టగా.. ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్ 22న సంబా జిల్లాలో జాతీయ రహదారి సమీపంలో ఓ సొరంగమార్గం ఉపయోగించి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడినట్లు నిర్ధరణకు వచ్చారు.
ఇదీ చదవండి
పాక్ సరిహద్దులో సొరంగం గుర్తింపు
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
