-20 డిగ్రీల చలిలో.. 17వేల అడుగుల ఎత్తులో..!

తాజా వార్తలు

Published : 15/11/2020 03:26 IST

-20 డిగ్రీల చలిలో.. 17వేల అడుగుల ఎత్తులో..!


న్యూ దిల్లీ : చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్‌  జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో శనివారం దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ మంచుప్రాంత ఉష్ణోగ్రత ప్రస్తుతం సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో  కూడా దీపావళి సందర్భంగా   జవాన్లు ఆనందంగా నృత్యాలు చేశారు.  భారత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కంపోజ్‌ చేసిన ‘అహో ఫిర్‌ ఫిర్‌ దియా జాలేనా’అనే పాటను పాడుతూ నృత్యాలు చేశారు.  శీతాకాలంలో  ఈ ప్రాంత ఉష్ణోగ్రత మైనస్‌ 40 డిగ్రీస్‌కు తగ్గుతుంది.  ప్రధానమంత్రి మోదీ శనివారం జైసల్మీర్‌లోని లోంగోవాలా పోస్ట్‌ సరిహద్దు జవాన్లను  కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా జవాన్లనుద్దేశించి  మోదీ ఉద్వేగభరిత ప్రసంగం ఇచ్చారు. గత సంవత్సరం మోదీ ఉత్తరాఖండ్‌లోని  భారత-చైనా, భారత- టిబెట్‌ సరిహద్దు పోలీసు జవాన్లు, జమ్ము&కశ్మీర్‌ జవాన్లతో దీపావళి జరుపుకొన్న విషయం తెలిసిందే.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని