ఆప్షన్‌గానే వ్యాక్సిన్‌ : అమెరికా

తాజా వార్తలు

Updated : 20/08/2020 12:15 IST

ఆప్షన్‌గానే వ్యాక్సిన్‌ : అమెరికా

ప్రతిఒక్కరికీ తప్పనిసరి చేయబోమన్న అగ్రరాజ్యం
స్థానిక ప్రభుత్వాలకే ఆ వెసులుబాటు - ఆంథోనీ ఫౌచీ

వాషింగ్టన్‌: కొవిడ్-‌19కు వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత అమెరికాలో సామాన్యులకు దాన్ని తప్పనిసరి చేయబోమని అమెరికా అంటువ్యాధుల నిపుణుల ఉన్నతాధికారి ఆంథోనీ ఫౌచీ వెల్లడించారు. అయితే, పిల్లలతోపాటు మరికొన్ని గ్రూపులకు తప్పనిసరిగా వేసే వెసులుబాటు స్థానిక ప్రభుత్వాలకు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. వ్యాక్సిన్‌ ఆమోదం పొందిన తర్వాత దీన్ని దేశమంతా తప్పనిసరి చేస్తామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌‌ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లోని కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు ఫౌచి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘మీరు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయకూడదు. మేమెప్పుడూ అలా చేయలేదు’ అని జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఫౌచి పేర్కొన్నారు. కేవలం ఆరోగ్య కార్యకర్తలు వంటి గ్రూపులకు మాత్రమే వ్యాక్సిన్‌ తప్పనిసరిచేయవచ్చని, సామాన్య ప్రజలకు అలా చేయకూడదని అన్నారు. వ్యాక్సిన్‌ను బలవంతంగా ఇవ్వకూడదని, అది సరైనా పద్ధతికూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, కరోనా వ్యాక్సిన్‌ను అమెరికాలో ఉచితంగా అందిస్తామని అధ్యక్షుడు ట్రంప్‌ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసుల కోసం పలు సంస్థలతో అమెరికా ఒప్పందాలను కుదుర్చుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని